పెగడపల్లి: రైతులు భూసారాన్ని పరిరక్షిస్తూ, శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ జాన్ సుధాకర్ అన్నారు. మండలంలోని రాజారంపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులతో సమావేశం నిర్వహించారు. భూసార సంరక్షణ, పంటల సాగులో వైవిద్యం, రబీ పంటల సాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూసార పరీక్షలతో భూసారానికి అనుగుణంగా ఎరువులు వినియోగిస్తూ, పంటలు సాగు చేయాలని, సేంద్రియ ఎరువులు వినియోగించాలన్నారు. విచక్షణారహితంగా రసాయన ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని సూచించారు. ఒకే పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. నీ టి వనరుల లభ్యతకు అనుగుణంగా తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే కందులు, పెసర వంటి పప్పు ధాన్యాలు సాగు చేయాలన్నారు. మండల వ్యవసాయాధికారి శ్రీకాంత్, స ర్పంచ్ రమేశ్ నాయక్, ఏఈవో అక్షయ్ పాల్గొన్నారు.


