జగిత్యాల: జగిత్యాలలోని నూకపల్లి పరిధి డంపింగ్‌యార్డులో రెండో రోజు శుక్రవారం రాత్రి మంటలు వ్యాప్తిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెండురోజుల క్రితం డంపింగ్‌యార్డులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. మంట లను అదుపు చేయకుండా డంపింగ్‌యార్డులోకి ము న్సిపల్ వాహనాల్లో మళ్లీ చెత్తను తీసుకవస్తుండడంతో డబుల్బెడ్రూం కాలనీవాసులు డంపింగ్‌యా ర్డు వద్ద అడ్డుకున్నారు. ఇప్పటికే డంపింగ్‌యార్డులో అంటుకున్న మంటలతో కాలనీ మొత్తం పొగతో తీ వ్ర అవస్థలు పడుతున్నారు. కొంత మంది ఆస్పత్రుల్లో చేరారు. మళ్లీ ఇక్కడికి చెత్తను తీసుకురావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త వాహనాలను అ డ్డుకున్నారు. కమిషనర్ సత్యప్రణవ్ ఘటన స్థలాని కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


