కోరుట్ల పట్టణ శివారులోని సాయిరామా నదీతీరంలో ఉన్న సాయిబాబా ఆలయంలో సాయి 108వ పుణ్య తిథి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. సాయినాథునికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవ చేపట్టారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు, ఆలయ ఈవోతోపాటు అధ్యక్షుడు బాలె నర్సయ్య, కమిటీ సభ్యులు దేవయ్య, నాగభూషణం, విద్యాసాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. – కోరుట్ల


