జగిత్యాలరూరల్: నాడు కిక్‌బాక్సింగ్ చాంపియన్‌గా రాణించిన బాలిక నేడు జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికై ంది. జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన ముద్దం అన్షుమిత్ర పటేల్ ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన 70వ ఎస్జీఎఫ్ అండర్– 17 క్రికెట్ పోటీల్లో 150 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీంతో నవంబర్ 14 నుంచి 20 వరకు జమ్ముకశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. టాప్ఆర్డర్ బ్యాటర్, ఆల్‌రౌండర్‌గా అన్షుమిత్ర తన బ్యాటింగ్‌తో వరంగల్‌తో జరిగిన మ్యాచ్‌లో 32, మహబూబ్‌నగర్ జట్టుపై 30 పరుగులు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టును గెలిపించారు. అలాగే అత్యంత పటిష్టమైన హైదరాబాద్ జట్టుపై కరీంనగర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్– 15 టీం సెలక్షన్ కోసం నిర్వహించిన రెండు మ్యాచ్‌ల్లో 2 అర్ధసెంచరీలు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.


