ఇటుక బట్టీల్లో సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఇటుక బట్టీల్లో సౌకర్యాలు కల్పించాలి

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

జగిత్యాలజోన్‌: ఇటుక బట్టీల్లో కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. జగిత్యాల అర్బన్‌ మండలం టీఆర్‌నగర్‌లోని ఇటుకబట్టీలను శుక్రవారం తనిఖీ చేశారు. కార్మికుల పనివేళలు, మౌలిక వసతుల గురించి బట్టీ యజమానిని అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత యజమానులపై ఉందన్నారు. కార్మికుల హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. వేతనాలు సకాలంలో ఇస్తున్నారా, చెల్లింపుల్లో ఏమైనా కోతలు విధిస్తున్నారా అని తెలుసుకున్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని సూచించారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలకు బాలాజీ

జగిత్యాల: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా గల్గోటియా వి శ్వవిద్యాలయంలో ఈనెల 31 నుంచి నవంబర్‌ 5 వరకు జరిగే జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలకు జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాల విద్యార్థి జోగినిపల్లి బా లాజీ ఎంపికయ్యాడు. ఇటీవల శాతావాహన విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్‌ విశ్వవిద్యాలయ బాక్సింగ్‌ పోటీల్లో బాలాజీ 40–50 కిలోల విభాగంలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ రాజు, ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు శ్రీనివాస్‌ అభినందించారు.

శిశుమరణాలు తగ్గించాలి

జగిత్యాల: జిల్లాలో శిశుమరణాలు తగ్గించి, గర్భిణులకు నాణ్యమైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధిక ప్రమాద గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో శిశువులను సకాలంలో ఎస్‌ఎన్‌సీయూ ఎన్‌బీఎస్‌యూ కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు. వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీడబ్ల్యూవో భాస్కర్‌, డెప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, నరేంద్ర, రాజేందర్‌రెడ్డి, నవీన పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

జగిత్యాలటౌన్‌: ఇరవై ఏళ్లుగా జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం)పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి కోరారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాశెట్టి తిరుపతి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ శ్రీనివాస్‌, ఆముద రాజు, రాజశేఖర్‌గౌడ్‌, ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గజెల్లి శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement