జగిత్యాల: అర్బన్ హౌసింగ్కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం కాలనీలో రూ.2.77 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో కాలనీలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందుతాయన్నారు. కాలనీలో మొబైల్ టవర్ లేక సిగ్నల్స్ ఉండడం లేదని కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, కాలనీలో సబ్స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ సమస్యలు ఉండవన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, అర్హులకు పథకాలు అందేలా చూస్తున్నామన్నారు. గృహ జ్యోతి పథకం కింద అర్హత ఉన్నా ఉచిత విద్యుత్ పొందని కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, కమిషనర్ సత్యప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.


