జగిత్యాల: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాన్ని జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత కేవీ.నరేందర్ శనివారం హైదరాబాద్‌లో అందుకున్నారు. 2025–26కు గాను ఈ పురస్కారం వరించింది. నరేందర్ ఇప్పటికే 200కు పైగా కథలు, 5 నవలలు, 45 కవితలు, 4 నాటికలు, 18 వ్యాసాలు రాశారు. గర్భగుడి నాటకానికి నంది పురస్కారం లభించింది. తెలంగాణ ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా 2016లో అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ తెలంగాణ రచయిత అవార్డు అందుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో విశిష్ఠ కథ రచయిత పురస్కారం, తెలుగు యూనివర్సిటి కీర్తి పురస్కారం, తాజాగా సినీనటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, విశ్వవిద్యాలయ ఉప కులపతి నిత్యానందరావు, రిజిస్ట్రార్ హన్మంతరావు చేతుల మీదుగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.


