● బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి
రాయికల్: రైతులపై సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసాను కేవలం రెండెకరాలకే పరిమితం చేశారని, వరికి బదులు ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, నూనె గింజలు పండించాలని సలహా ఇస్తున్నా.. వాటికి ఎలాంటి రాయితీ ఇస్తారో చెప్పలేదని పేర్కొన్నారు. పప్పుదినుసులు పండాలంటే కోతుల బెడద తీవ్రంగా ఉందని, కోతుల పునరుత్పత్తి నిలుపుదల కేంద్రాన్ని జిల్లాకొకటి ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు సోలార్ పెన్సింగ్ కింద 50 శాతం రాయితీ ఇవ్వాలని, విత్తన రాయితీ కనుమరుగై పోయిందని తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ విత్తనాలు ఉచితంగా అందించాలన్నారు. ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదని, యూరియాకు సంబంధించిన యాప్‌ను బ్లాక్ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, నాయకులు గోపి రాజిరెడ్డి, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, ఎనగందుల ఉదయశ్రీ, కౌన్సిలర్లు రాకేశ్‌నాయక్, సర్పంచ్ గుమ్మడి సంతోష్, బత్తినిభూమన్న, నాగరాజు, మహేశ్, పొన్నం శ్రీకాంత్, హరీశ్‌రావు, మండ రమేశ్ పాల్గొన్నారు.


