ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జగిత్యాల/కథలాపూర్‌/జగిత్యాలరూరల్‌: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. కథలాపూర్‌ మండలం కలిగోట కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ధాన్యాన్ని రైస్‌మిల్లులకు త్వరగా పంపించాలని, 24 గంటల్లోగా అన్‌లోడ్‌ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో జివాకర్‌రెడ్డి, డీటీవో సంధాని, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేశ్‌, ఆర్‌ఐ రవీందర్‌ ఉన్నారు.

ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించండి

వర్షాకాలంలో ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్‌ అన్నారు. ఇసుక రీచ్‌ల గుర్తింపు, తవ్వకాలపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. భూగర్భజల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ఇసుకకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని, తవ్వకం, రవాణాలో పారదర్శకత పాటించాలని సూచించారు. ధర్మపురి పరిధిలో ప్రస్తుతం అధికారికంగా తవ్వకాలకు అనుమతులు లేవన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి గోదావరి పరిధిలో అనువైన రీచ్‌లను గుర్తించి గనులశాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ లత పాల్గొన్నారు.

అర్హులందరికీ పథకాలు అందించాలి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత అన్నారు. బీర్‌పూర్‌ మండలంతోపాటు మోతీనగర్‌, నరసింహులపల్లి, కందెనకుంటలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ట్రక్‌ షీట్‌ నమోదు, ట్యాబ్‌ఎంట్రీ వెంటవెంటనే పూర్తి చేయాలన్నారు. తుంగూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. 99 రోజుల్లో వచ్చిన వినతులను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ సుజాత ఉన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement