నెల రోజులైంది.. | - | Sakshi
Sakshi News home page

నెల రోజులైంది..

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

నేను మక్కలు అమ్మి నెల రోజులవుతోంది. అప్పటినుంచి డబ్బులు రాకపోతే వానాకాలం సీజన్‌కు ఎలా పెట్టుబడి పెట్టాలి..? బ్యాంకులో రుణం ఎలా చెల్లించాలి..? ఒకవేళ రుణం చెల్లించకుంటే వడ్డీమీద పడుతుంది. డబ్బులు ఖాతాలో వేశారేమోనని రోజు బ్యాంకుకు వెళ్లి చూడాల్సి వస్తోంది.

– బందెల మల్లయ్య, చల్‌గల్‌, జగిత్యాల రూరల్‌(మం)

రూ.10 కోట్లు జమ చేశాం

ఇప్పటికే రూ.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఆలస్యం చేయకుండా రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ప్రభుత్వం నుంచి మార్క్‌ఫెడ్‌ సంస్థకు డబ్బులు రాగానే.. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు చేశాం. అన్నదాతలు అర్థం చేసుకుని సంస్థకు సహకరించాలి.

– ఎండీ. హాబీబ్‌, జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement