ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ద్వారా మేము ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలని సంకల్పించాం. ప్రతీ ఒక్కరు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం మాకు గర్వకారణం.
– నాగిరెడ్డి సిద్దారెడ్డి,
యోగా సంఘం జిల్లా అధ్యక్షులు
యోగా అనేది అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం. శరీరానికే కాదు.. మనస్సుకు కూడా వ్యాయామం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. సరైన పద్ధతిలో నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.
– మల్లిక, యోగా కోచ్


