బ్యాటరీ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాటరీ దొంగల అరెస్ట్‌

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జగిత్యాలక్రైం: గ్రామాల్లో ఇంటర్నెట్‌ కోసం టీ–ఫైబర్‌ అనుబంధ సంస్థ శాటిలైట్‌ టెక్నాలజీ ఏర్పాటు చేసిన బ్యాటరీలు, యూపీఎస్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల రూరల్‌ సీఐ సుధాకర్‌ అన్నారు. గురువారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. రూరల్‌ మండలం ధర్మా రం, లక్ష్మీపూర్‌, తిమ్మాపూర్‌, కల్లెడ, సంగంపల్లి, హన్మాజీపేట, అనంతారం, గుట్రాజ్‌పల్లి, అంతర్గాంతోపాటు గొల్లపల్లి మండలాల్లో టీ ఫైబర్‌ పరికరాలను లక్ష్యంగా చేసుకుని లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన బండ అంజయ్య, మండలి రవి, చేవెల్ల నరేశ్‌ 39 బ్యాటరీలు, 4 యూపీఎస్‌లను దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.4.52 లక్షలు ఉంటుంది. దొంగిలించిన బ్యాటరీలను విక్రయించేందుకు గురువారం వెళ్లూ.. రూరల్‌ ఎస్సై ఉమాసాగర్‌ ధరూర్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. నిందితుల నుంచి 39 బ్యాటరీలు, 4 యూపీఎస్‌లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఉమాసాగర్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, మహేందర్‌ను సీఐ అభినందించారు.

ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలింపు

39 బ్యాటరీలు, 4 యూపీఎస్‌లు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement