ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. న్యాయం చేయండి

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జగిత్యాలటౌన్‌: కట్టుకున్న భర్త, కనిపెంచిన కొడుకుతోపాటు కోడలు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు ఆర్డీవోకు విన్నవించింది. బాధితురాలి కథనం ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన బత్తుల భారతి (61) భర్త శంకర్‌ ఎంపీవో (మండల పంచాయతీ అధికారి)గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. కొడుకు సంతోష్‌ ప్రభుత్వ వైద్యుడు. కోడలు అనూష కూడా వైద్యురాలే. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో భర్తతోపాటు కొడుకు, కోడలు కనికరం లేకుండా తనను అనేక రకాలుగా మానసిక, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అద్దె ఇంట్లో తలదాచుకుంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్య సమస్యలతోపాటు ఒంటరితనం భరించలేకుండా పోతోంది. భర్త, కొడుకు, కోడలలిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆర్డీవోను వేడుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement