● అరెస్ట్ చేసిన పోలీసులు
మెట్‌పల్లి: ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ సురేష్‌బాబు తెలిపారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన అరే శంకర్ (50), ఆయన భార్య అనూష(45) కొంతకాలంగా మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ మండలాల్లోని ఎనిమిది ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దంపతులను అరెస్ట్ చేసి వారి నుంచి 20గ్రాముల బంగారం, 1.250 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


