న్యూస్‌రీల్
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేదికతో పాటు అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానాలు తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య, వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడిన ఈ ప్రాంతం నేడు విద్యా,వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం కొత్తజిల్లాల వారీగా ఆధునిక వైద్యసేవలు, మెడికల్ కాలేజీలు, మాతాశిశు ఆరోగ్యకేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేట్
ఇంజినీరింగ్ కాలేజీలు, డిజిటల్ విద్యావసతులు అందుబాటులోకి వచ్చాయి. నీటిపారుదల, సాగు రంగంలో వచ్చిన
కీలకమార్పులతో ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కలిగి, తలసరి ఆదాయం మెరుగుపడింది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్


