పేదింటి పిల్లలకు ఐఐటీ సీట్లు | - | Sakshi
Sakshi News home page

పేదింటి పిల్లలకు ఐఐటీ సీట్లు

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

● చేయూత కోసం ఎదురుచూపులు

కోరుట్ల: సరస్వతీ కటాక్షం ఉన్నా ఆర్థిక చేయూత కో సం ఎదురుచూపులు తప్పడం లేదు. కోరుట్లకు చెందిన లక్కం లక్ష్మి భర్త దుబాయ్‌ వెళ్లినా కుటుంబా నికి అండగా నిలవలేదు. ఫలితంగా ఇద్దరు కూతుళ్ల పోషణ భారం లక్ష్మిపైనే పడింది. నానా కష్టాలు పడి పెద్ద కూతురుకు పెళ్లి చేయగా, చిన్నకూతురు భానుజ్ఞను బీడీలు చేస్తే వచ్చిన డబ్బులతో కోరుట్ల జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో చదివించింది. పదో తరగతిలో ప్రతిభచాటి ఐఐటీలో సీటు సాధించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనుకున్నంత మేర లేకపోవడంతో భానుజ్ఞ ఐఐటీ చదవడానికి చేయూత కోసం ఎదురుచూస్తుంది. పాఠశాల హెచ్‌ఎం గంగాధర్‌ చొరవ తీసుకుని భానుజ్ఞ చదువుకు తాము తోడ్పాటు అందిస్తామని ఆర్థిక చేయూతకు ముందుకు రావడం గమనార్హం. మరింత మంది దాతలు సహకరిస్తే భానుజ్ఞ ఐఐటీ చదువుకు చేయూతగా నిలవాలని తల్లి వేడుకుంటుంది. అలాగే కోరుట్లలోని కల్లూర్‌ మోడల్‌ స్కూల్‌లో చదివిన వాసాల ప్రస్విత పదో తరగతిలో ప్రతిభ చూపి ఐఐటీలో సీటు సాధించింది. ప్రస్విత తల్లి శివ రోజువారీ పాల అమ్మకాలతో కుటుంబ పోషణ సాగిస్తున్న క్రమంలో ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement