దాతలు సహకరిస్తేనే | - | Sakshi
Sakshi News home page

దాతలు సహకరిస్తేనే

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

మా నాన్న సాయన్న, అమ్మ చిన్నమ్మ. ప్రభుత్వ బడిలో 10వ తరగతి చదివి 553 మార్కులు సాధించాను. బాసర ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చింది. నాన్న అనారోగ్యంతో ఇంటి వద్ద ఉంటున్నాడు. అమ్మ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటమనిషి సహాయకురాలుగా పని చేస్తోంది. ఆమెకు వచ్చే రూ.2వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకునే దీన పరిస్థితి మాది. దాతలు స్పందిస్తేనే ట్రిపుల్‌ ఐటీ చదవు. కనీసం అడ్మిషన్‌ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి మా కుటుంబానిది. దాతలు సహకరించి అడ్మిషన్‌ ఫీజు చెల్లించి ఆదుకోండి. వివరాలకు 78158 80228 నంబర్‌లో సంప్రదించగలరు. – రాజ్‌దీపక్‌

Advertisement
 
Advertisement
Advertisement