వెల్గటూర్:ఉమ్మడి వెల్గటూర్ మండలంలో ఇటుకబట్టీ వ్యాపారుల
అక్రమ దందా జోరుగా సాగుతోంది. రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొసున్న అక్రమ ఇటుకబట్టీలు కార్మికుల బతుకులను చిధ్రం చేస్తుండడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నాయి. యజమానులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ, కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయడంలో, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో బట్టీల నిర్వహణతో దుమ్ము, ధూళి, పొగ రోడ్డంతా వ్యాపించి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


