నాన్నకు అనారోగ్యం.. అమ్మ దినసరి కూలీ | - | Sakshi
Sakshi News home page

నాన్నకు అనారోగ్యం.. అమ్మ దినసరి కూలీ

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

మాది రాయికల్‌ మండలం భూపతిపూర్‌. నాన్న లక్ష్మీరాజం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అమ్మ రాధ దినసరి కూలీ. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి 568 మార్కులు సాధించాను. ట్రిపుల్‌ ఐటీ బాసరలో సీటు వచ్చింది. సీటు వచ్చిన సంతోషమేగానీ.. చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. కనీసం అడ్మిషన్‌ ఫీజు, ఇతర ఖర్చులు చెల్లించలేని దుస్థితిలో మా కుటుంబం ఉంది. దాతలు స్పందిస్తే ట్రిపుల్‌ ఐటీలో చదవడానికి సిద్ధంగా ఉన్నాను. లేకుంటే చదువుకు దూరం కావాల్సిందే. ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్‌ ఫీజు, ఇతర ఖర్చులు రూ.30వేల వరకు అవుతాయని అంటున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సహాయం చేసి నా చదువుకు బాట వేయండి. దాతలు 86396 73343 నంబర్‌లో సంప్రదించండి. న్యాతగిరి సంజన

Advertisement
 
Advertisement
Advertisement