వానాకాలం సీజన్ సమీపిస్తుండటంతో టమాట తోటను దున్నేశాను. వర్షాలు పడిన తర్వాత మళ్లీ కొంత కూరగాయలు సాగు చేయాలనుకుంటున్నాను. రోజు రూ.వెయ్యి వరకు కూరగాయలు అమ్మేవాడిని. ఇప్పుడు కూరగాయల తోట లేదు.
– రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాలరూరల్(మం)
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
టమాట, మిర్చి, కొత్తిమీర వంటి వాటిని మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రవాణా చార్జీలు పెరిగి ధరలు మండుతున్నాయి. స్థానికంగా గోరుచిక్కుడు, సోర వంటి కొన్ని కూరగాయలు స్థానిక మార్కెట్లకు వస్తున్నాయి.
– కట్ట లత, జిల్లా ఉద్యానశాఖాధికారిణి, జగిత్యాల


