జ్యోతినగర్: భారతావనికి వెలుగులు ప్రసరింపజేస్తున్న ఎన్టీపీసీ తమ పరిధిలోని ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభావిత, పునరావాస ప్రాంతాలు అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, కమాన్‌పూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలకు బాలికా సాధికారత మిషన్–2026 ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో.. బేటీ పడావోకు అనుగుణంగా ఎన్టీపీసీ నడుచుకుంటోంది. ఇందుకోసం రామగుండం ప్రాజెక్టులోని శ్రీచైతన్య కళాశాల భవనంలో బాలికా సాధికారత అంశంపై 10 నుంచి 12 ఏళ్ల వయసు లోపు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలను శిక్షణకు ఎంపిక చేసింది. వీరికి 28 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తోంది.
● కార్యక్రమం ప్రధాన ఉద్దేశం..
● బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం
● వ్యక్తిగత ఆరోగ్యం, శారీరిక సమస్యలు, ఇంటర్నెట్, సైబర్ నేరాలు, భవిష్యత్ గురించి గొప్ప కలలు, ఆలోచనలు కలిగింపజేయడం.
● జీవితంలో సమున్నత లక్ష్యాలు చేరుకోవాలనే ఆలోచన, తపన కల్పించడం
● పాఠ్యాంశాల్లో శిక్షణ
● సరళమైన తెలుగు, ఆంగ్ల భాషపై పట్టు, యోగా, గణితశాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు, మెలకువలు, పర్యావరణశాస్త్రం, ఆత్మరక్షణ, క్రీడలు, కంప్యూటర్స్ వినియోగం, పౌష్టికాహారంతో ఉపయోగాలు, 5ఎస్ విధానాలు
● శిక్షణ ఇచ్చే అంశాలు
● అగ్నిమాపక భద్రతా చర్యలు, సివిల్ సర్వీసెస్
● కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్స్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై అవగాహన
● సామూహిక చర్చలు
● సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకరంగం
● మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ
● యోగా
● శిక్షణ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు
● వసతి గృహం వద్ద 24 గంటలు మహిళా సెక్యూరిటీ గార్డులతో రక్షణ
● ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా వార్డెన్లు
● కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ
● సీసీ కెమెరాలతో నిఘా
బాలికా సాధికారతే దేశాభివృద్ధికి పునాది
బాలికల కోసం ఎన్టీపీసీ వినూత్న కార్యక్రమం
140 మంది విద్యార్థినులకు వేసవి శిక్షణ శిబిరం


