మరణానంతరం ముగ్గురి జీవితాల్లో వెలుగు | - | Sakshi
Sakshi News home page

మరణానంతరం ముగ్గురి జీవితాల్లో వెలుగు

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

మెట్‌పల్లి: మరణించిన తర్వాత ఆయన అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి ముగ్గురి జీవితాల్లో వెలుగు నింపిన సంఘటన మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఆరపేటకు చెందిన పుడుకారం వెంకట్‌రెడ్డి(45) ఈనెల 26న ద్విచక్ర వాహనంపై తన తోటకు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. 29న బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అవయవాలు దానం చేస్తే కొందరికి కొత్త జీవితం ఇచ్చినట్లవుతుందని భార్య హరిత, కుమార్తె సాహితికి వైద్యులు చెప్పగా.. వారు అంగీకరించారు. జీవన్‌దాన్‌ ద్వారా ఆయన 2 కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు.

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మెట్‌పల్లివాసి

అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులు

Advertisement
 
Advertisement
Advertisement