రాయికల్: రామాజీపేట గ్రామ శివారులో శనివారం పొలాల్లో ఉన్న 11 కేవీ తీగలు తెగి పడడంతో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గ్రామంలోని వందలాది ఎకరాల్లో కోత కోసిన వరి, మొక్కజొన్న కొయ్యలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మంటలు వ్యాపించాయని రైతులు ఆరోపించారు. ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని రైతులు సంతోష్‌రావు, అంబల రాజిరెడ్డి, రాజు, రాజశేఖర్ డిమాండ్ చేశారు.


