ఎండాకాలం మధ్యాహ్నం. తాతయ్య వచ్చాడు.
చేతిలో దాసరి రఘు గౌడ్ గారు ఇచ్చిన లేత ముంజకాయల గెల. పైన తడి గుడ్డ కప్పి తెచ్చాడు.
వాకిట్లో ఆడుకుంటున్న బన్నీ, వాడి స్నేహితులు పరుగున వచ్చారు.
‘తాతయ్య... మాకు కూడా’ అని చుట్టూ మూగారు.
తాతయ్య నవ్వుతూ కత్తి తెచ్చి ఒక్కొక్కటిగా కోశాడు.
లోపల తెల్లని జిగేలు మంచులా మెరుస్తున్నాయి.
బన్నీకి మొదట ఇచ్చాడు. తర్వాత రామ్‌కి, చుక్కకి, స్వప్నకి ఇచ్చాడు.
అందరి అరచేతుల్లో చల్లటి ముంజ జిగురు నిండింది.
ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే దాహం తీరింది. వేడి తగ్గింది.
పిల్లల మొహాల్లో తియ్యటి నవ్వులు విరిశాయి.
తాతయ్య వాళ్ళ ఆనందం చూసి మురిసిపోయాడు.
‘తినండి, ఇంకా ఉన్నాయి’ అన్నాడు.
ఆ రోజు ముంజకాయలు కాదు, తాతయ్య ప్రేమే అందరికీ పంచాడు.
పిల్లలకి మాట:
లేత ముంజకాయల రుచి
మమతలకు సురుచి
గౌడన్నలకు అభివందనం
– డాక్టర్ కోట లక్ష్మణ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు,
గ్రామం: కాకర్లపల్లి,
మంథని
జిల్లా: పెద్దపల్లి


