జాతి ఐక్యత–దేశ భద్రత! | - | Sakshi
Sakshi News home page

జాతి ఐక్యత–దేశ భద్రత!

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

ఈ పవిత్ర భారతదేశం నా దేశం

నే పుట్టి పెరిగిన నా జన్మ ప్రదేశం

అందిస్తుంది ఇది ఓ శుభ సందేశం

బంధిస్తుంది మనలను ఆ ఆదేశం!

స్పందిద్దాం భారతీయులకు అందిద్దాం

విందిద్దాం మన ఐక్యతను చిందిద్దాం

మన దేశ భద్రత మనందరకు ముఖ్యం

అప్పుడే మనందరకు కలుగు సౌఖ్యం !

కలసికట్టుగా మనమంతా ఇక ఉందాం

అలసినట్టున్న బలం పుంజుకుందాం

దేశ భద్రతకు మనం కట్టుబడి ఉందాం

దేశ ఐక్యతయే ఘనం పెట్టుబడి అందాం !

పరాయి ముష్కరుల పెంచి పోషిస్తున్న

తురాయి ఎగిరేసి మనల ద్వేషిస్తున్న

చైనా పాకిస్తానులకు చెప్పాలిక బుద్ధి

అంతర్జాతీయ వేదికపై మనం బల్ల గుద్ది !

మన దేశ భద్రత మనందరి బాధ్యత

ఘన సైనికులకే ఉంది ఆ యోగ్యత

అయినా మనందరం పాలు పంచుకుందాం

స్వయానా సరిహద్దు వివాదం తెంచుకుందాం !

ప్రజలందరకు కంటినిండా నిద్రించే భరోసానిద్దాం

సైనిక రక్షణ వ్యవస్థను చక్కదిద్దు ధిలాసా చిందిద్దాం

భరతజాతి సమైక్యతను పటిష్టం చేసేద్దాం

భరతఖండం భద్రతను పరిపుష్టం గావిద్దాం!

గుర్రాల లక్ష్మారెడ్డి

– కవి, రచయిత

– కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement