మార్కుల కాగితాలు ఇంటర్వ్యూ గేటు వరకే నడిపిస్తాయి. మీలోని ప్రాక్టికల్ నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగాన్ని సాధించి పెడతాయి. నేటి ఆధునిక పరిశ్రమలకు పుస్తకాల పురుగులు కాదు. సమస్యలను ధైర్యంగా పరిష్కరించే సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే అత్యవసరం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను, ని రంతర అభ్యాసన తత్వాన్ని ఆయుధాలుగా మార్చుకుని ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి దూసుకుపోవచ్చు. ర్యాంకులు రాలేదని నిరాశ పడకుండా, మీలోని విశిష్ట ప్రతిభకు పదును పెడితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. – వై. తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్


