జగిత్యాలరూరల్: బీర్‌పూర్ నృసింహస్వామిని జిల్లా ఇన్‌చార్జి జడ్జి దంపతులు సునీత, మహేందర్‌రెడ్డి దంపతులు, పీడీఎం కోర్టు జడ్జి లావణ్య శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ రినోవేషన్ కమిటీ సభ్యుడు భీమనాతి లవన్ కుమార్, బీర్‌పూర్ ఎస్సై సబ్బని రాజు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి అజారుద్దీన్
జగిత్యాల: జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా మై నార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ హాజరుకానున్నారు. ముందుగా అమరవీరులకు నివాళులు అ ర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవి ష్కరించనున్నారు. గతేడాది మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పతాకావిష్కరణ చేసిన విష యం తెల్సిందే. ఈ ఏడాది అడ్లూరి కరీంనగర్‌లో పతాకావిష్కరణ చేయనున్నారు.
బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: మూడు రోజు లుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చ పేరుతో సవాళ్లు విసురుకుంటున్నారు. ఈనెల 29న బీజేపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర కార్యదర్శి బాగోజి ముఖేశ్ కన్నా పిలుపునివ్వగా.. తాము సిద్ధమని, శనివారం ఉదయం 11 గంటలకు రావాలని బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. దీంతోపాటు వాల్‌పోస్టర్లు వేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ఇంట్లో ఉన్న కార్యకర్తలను పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తహసీల్ చౌరస్తా వద్ధ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు శ్రావణి ఇంటి వద్దే ఖాళీ కుర్చికి ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ అంటించి నిరసన తెలిపారు.
బ్యాంక్ రుణాలతో ఆర్థిక వృద్ధి
రాయికల్: వడ్డీ లేని రుణాల ద్వారా మహిళల ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారని ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇటిక్యాలలో ప్రజాపాలన – ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా మహిళల విజ యోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. సీ్త్రనిధి సేవలు, లోన్‌బీమా, ప్రమాదబీమా, బ్యాంక్ లింకేజీ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సాయిరెడ్డి, ఏపీఎం నరహరి, సీసీ లావణ్య, వీవో ఏలు రాధ, లావణ్య, రాజశ్రీ పాల్గొన్నారు.
మామిడితోటల పెంపకంపై శిక్షణ
మేడిపల్లి: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మేడిపల్లి మండలం పోరుమల్లలో శని వారం మామిడి తోటల్లో కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. మామిడి కోత అనంతరం, చెట్లు ఒత్తిడికి గురై బలహీనపడే అవకాశం ఉన్నందున, తగినంతా నీరు అందించాలని సూచించారు. ఏడాదిపాటు పాటించాల్సిన నెలవారీ సాగు పద్ధతులను వివరించారు. పూత సమృద్ధిగా వచ్చినా.. పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా తేనెటీగల సంచారం తగ్గి పరాగసంపర్కం సక్రమంగా జరగక పిందె ఏర్పాటుపై ప్రభావం పడుతోందని, తద్వారా దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. కాయలను కోసిన వెంటనే కార్బండిజమ్ ద్రావణంలో శుద్ధి చేసి మార్కెట్‌కు తరలిస్తే మంచి ధర లభిస్తుందన్నారు. సర్పంచ్ అంజన్న, ఉప సర్పంచ్ ప్రణయ్, హెచ్‌ఈవో అనిల్ కుమార్, కట్లకుంట, పోరుమల్ల రైతులు పాల్గొన్నారు.


