ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

కొత్తగా 69 పాఠశాలలు మంజూరు ఆటపాటలతో విద్యాబోధనకు శ్రీకారం కార్పొరేట్‌కు దీటుగా అధునిక వసతులు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

మల్లాపూర్‌: ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో కొత్తగా 69 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గతేడాది 51 ప్రీప్రైమరీ బడులు ప్రారంభించగా.. కొత్తవాటితో కలుపుకొని 120 కానున్నాయి. వచ్చే నెల 12నుంచి ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది. ఈ పాఠశాలల్లో ఫర్నిచర్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌ ఆట వస్తువులు, పెయింటింగ్స్‌ వంటి ఏర్పాట్లకు పాఠశాలకు రూ.1.70లక్షల చొప్పున కేటాయించనున్నారు

ఒక్కో బడిలో ఇన్‌స్ట్రక్టర్‌.. ఆయా

ప్రతి పాఠశాలలో ఒక ఇన్‌స్ట్రక్టర్‌తోపాటు ఒక ఆయాను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు ఇవ్వనున్నారు. నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి త్రీమెన్‌ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు.

ప్రీప్రైమరీకి ఎంపికై న బడుల జాబితా

బీర్పూర్‌ మండలంలో కొండ్లపల్లి, మంగేళ, తుంగూర్‌, కొల్వాయి, భీమారం మండలంలో గోవిందారం, మన్నెగూడం, రాగోజిపేట, ఓడ్డాడ్‌, బుగ్గారం మండలంలో చిన్నాపూర్‌, గంగపురం, శేకల్ల, వెల్గొండ, ధర్మపురి మండలంలో నాగారం, తుమ్మెనాల, ఇప్పలపల్లి, బుడ్డోజిపల్లి, ఎండపల్లి మండలంలో కొండాపూర్‌, ఎండపల్లి, ఉండెడ, అంబారిపేట, గొల్లపల్లి మండలంలో చిల్వకోడూర్‌, చెందోలి, ఇస్రాజ్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలంలో కొజన్‌కొత్తూర్‌, తిమ్మాపూర్‌, గోధూర్‌, ఇబ్రహీపట్నం, జగిత్యాల రూరల్‌ మండలంలో పొలాస, చల్‌గల్‌, నర్సింగపూర్‌, తక్కళ్లపల్లి, జగిత్యాలఅర్బన్‌ మండలంలో పురాణిపేట, ఫోర్ట్‌, ధరూర్‌, తిప్పన్నపేట, కథలాపూర్‌ మండలంలో కలికోట, అంబారిపేట, తక్కళ్లపల్లి, దులూర్‌, కొడిమ్యాల మండలంలో తిర్మలాపూర్‌, కొడిమ్యాల, సంద్రాలపల్లి, రామకృష్ణాపురం, కోరుట్ల మండలంలో పైడిమడుగు, నాగులపేట, కోరుట్ల(గడి), ధర్మారం, మల్లాపూర్‌ మండలంలో రేగుంట, సాతారం, వేంపల్లి, గుండంపల్లి, మల్యాల మండలంలో ఒబులాపూర్‌, రాంపూర్‌, నూకపల్లి, ముత్యంపేట, మానాల, మేడిపల్లి మండలంలో కొండాపూర్‌, పోరుమల్ల, తొంబర్రావుపేట, మెట్‌పల్లి మండలంలో వెల్లుల, గాజులపేట, ఎస్సారెస్పీ క్యాంప్‌, బుడిగజంగంకాలనీ, పెగడపల్లి మండలంలో నంచెర్ల, సుద్దపల్లి, నామాపూర్‌, వెంగలాయిపేట, రాయికల్‌ మండలంలో కొత్తపేట, భూపతిపూర్‌ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement