ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

జగిత్యాల: ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో వందశాతం మార్కులు సాధించిన 175 మంది విద్యార్థులకు శనివారం ప్రతిభ అవార్డులు అందించారు. హెల్త్‌కార్డుల విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి అపోహలు వద్దని, ఇవి ట్రస్ట్‌ ద్వారా నిర్వహించబడుతుందని, ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాలు కూడా సభ్యులుగా ఉన్నారని తెలిపారు. జూలైలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దినేశ్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు. నియోజకవర్గానికో పబ్లిక్‌ స్కూల్‌, ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డీఈవో రాము మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషితో ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement