జగిత్యాల: చట్టాలపై యువత అవగాహన ఉండాలని, సోషల్ మీడియా విద్యాభివృద్ధికి ఉపయోగించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో స్నేహ కార్యక్రమం నిర్వహించారు. యువత, బాలికలు తమ హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళల భద్రత, గౌరవం, సమాన అవకాశాల కోసం ప్రభుత్వం చట్టాలు, పథకాలు అమలు చేస్తోందన్నారు. సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో మంచికి వినియోగించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు, లింగవివక్ష, సైబర్ నేరాలు, మహిళల రక్షణ వంటి చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్ పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని దేవా దాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, రహదారులు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించా రు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరి ధిలో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, దే వాదాయ శాఖ ద్వారా చేపట్టే ఘాట్ల అభివృద్ధి, రోడ్ల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిపారు.


