గీత కార్మికులకు సహాయం అందించండి | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికులకు సహాయం అందించండి

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో అగ్ని ప్రమాదానికి వేలాది ఈత చెట్లు దగ్ధమై గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి ప్రభుత్వపరంగా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ను కోరారు. గీత కార్మికులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మెట్లచిట్టాపూర్‌, పెద్దాపూర్‌, కోనరావుపేట, సంగెం, ఐలాపూర్‌, మాదాపూర్‌, చిన్నమెట్‌పల్లి, మోహన్‌రావుపేట, ఫకీర్‌కొండాపూర్‌ గ్రామాల్లో సుమారు 18,100 ఈత చెట్లు దగ్ధమయ్యాయని, జీవనోపాధి కోల్పోయి గీత కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రెవెన్యూ, ఎకై ్సజ్‌ శాఖల అధికారులతో విచారణ జరిపించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదం సంభవించిన ఈత వనాల వద్ద బోర్లు మంజూరు చేసి నీటి సదుపాయం కల్పించాలని కోరారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు కేతిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, రాజేశ్‌, భూమయ్య, పలువురు గీత కార్మిక సంఘ నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement