గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

మెట్‌పల్లిరూరల్‌/కోరుట్లరూరల్‌: గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వ కుంట్ల సంజయ్‌ అన్నారు. మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌, పెద్దాపూర్‌ గ్రామాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఈత వనాలను శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటనతో దాదాపు 70 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, తక్షణ సాయం కిందట రూ.40 వేలు అందజేశారు. అలాగే కోరుట్ల మండలం అయిలాపూర్‌, చిన్నమెట్‌పల్లి గ్రామాల్లో కాలిపోయిన ఈతవనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement