టీబీని నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

టీబీని నిర్మూలిద్దాం

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

జగిత్యాల: క్షయ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, టీబీని నిర్మూలిద్దామని డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో క్షయపై వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, ఛాతిలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలుంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు వాడాలన్నారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, సీనియర్‌ అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement