24 గంటల్లో అన్‌లోడింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లో అన్‌లోడింగ్‌ చేయాలి

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

రాయికల్‌(జగిత్యాల): కొనుగోలు కేంద్రాల నుంచి లారీల ద్వారా తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో అన్‌లోడింగ్‌ చేయాలని అదనపు కలెక్టర్‌ లత సూచించారు. శుక్రవారం రాయికల్‌ మండలం మైతాపూర్‌ గ్రామంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం శివమణి రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హమాలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, తద్వారా ధాన్యం లోడింగ్‌ ప్రక్రియ వేగవంతం చేసి ఆలస్యం చేయకుండా లారీలను మిల్లులకు తరలించాలన్నారు. అన్‌లోడింగ్‌లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ నాగార్జున ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement