కల్లుగీతకు ప్రమాదకరంగా బెల్టుషాపులు | - | Sakshi
Sakshi News home page

కల్లుగీతకు ప్రమాదకరంగా బెల్టుషాపులు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

జగిత్యాలరూరల్‌: రాష్ట్రంలో గ్రామగ్రామాన బెల్టుషాపులు కల్లుగీత వృత్తికి ప్రమాదకరంగా మారా యని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కన్నాపూర్‌ గ్రామంలో ఇటీవల కాలిపోయిన ఈత, తాటివనాన్ని శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. అ న్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది గీతకార్మి క వృత్తి అని, ఇటీవల జిల్లాలో చాలా చోట్ల ప్రమాదవశాత్తు ఈత, తాటివనాలు కాలిపోవడంతో గీత వృత్తితో ఉపాధి పొందుతున్న వారికి తీవ్ర నష్టం వా టిల్లుతుందన్నారు. ప్రభుత్వం ఈత, తాటివనాన్ని నాటుకునేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూ ములు కేటాయించాలన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, సర్పంచ్‌ సతీశ్‌, మాజీ ఎంపీపీ రమేశ్‌బాబు, శ్రీని వాస్‌రెడ్డి, రాధకిషన్‌రావు, వెంకటేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement