మెట్‌పల్లి: మన ఇంట్లో ఉన్న వస్తువు మరమ్మతుకు వస్తే ఏం చేస్తాం..?? వెంటనే బాగు చేయించి తిరిగి వినియోగంలోకి తెచ్చుకుంటాం. అలాగే దేనికై నా డబ్బులు ఖర్చు చేసే ముందు అది మనకు ఉపయోగపడుతుందా..? లేదా..? అని ఎంతో ఆలోచిస్తాం. మెట్‌పల్లి మున్సిపాలిటీలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం భారీగా దుర్వినియోగమవుతోంది. పోయేది తమ సొమ్ము కాదుకదా.. అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండడంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, చేపట్టిన నిర్మాణాలు పనికి రాకుండా పోతుండడం విమర్శలకు తావిస్తోంది.
మరమ్మతుకొస్తే అంతే...
నిర్మించారు..వదిలేశారు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లు. సుమారు నాలుగేళ్ల క్రితం వీటిని నిర్మించారు. వ్యాపారులకు ఏమాత్రమూ ఉపయోగపడని ప్రాంతంలో ఈ షెడ్లను నిర్మించడంతో అక్కడకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన షెడ్లు అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉంటున్నాయి.
వినియోగంలోకి తీసుకొస్తాం
మినీ టిప్పర్ల మరమ్మతుకు టెండర్ నిర్వహించాం. సంబంధిత కాంట్రాక్టర్ తీరుతో కొంత జాప్యం జరుగుతోంది. అతనికి నోటీసులు జారీ చేశాం. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకుపోతాం. తొందరలోనే వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– నాగేశ్వర్‌రావు, డీఈఈ
ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు మినీ టిప్పర్ వాహనాలను పట్టణంలో చెత్త సేకరణ కోసం కొనుగోలు చేశారు. కొంతకాలానికి అవి పాడైపోగా.. మరమ్మతు చేయించాల్సిన బల్దియా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రస్తుతం వాటిని భగీరథ పంపుహౌజ్‌లో ఓ మూలన పెట్టేశారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలను బాగు చేయించకుండా ఇలా వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వృథా అవుతున్న ప్రజాధనం
వాహనాలు నడవక ప్రజల ఇబ్బందులు
మెట్‌పల్లి బల్దియాలో వింత పరిస్థితి
నిరుపయోగంగా వ్యాపారుల షెడ్లు


