కథలాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో 2,500 టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. వారి నుంచి అనుమతి రాగానే గోదాం నిర్మిస్తాం.
– రమణ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి
ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం
మండల ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు ఉపయోగపడే వాటిపై దృష్టిసారించకపోవడం బాధాకరం. ధాన్యం నిల్వ చేయాలంటే గోదాములు అవసరమని అందరికీ తెలుసు. మండలంలో ఒక్క గోదాం నిర్మించకపోవడం దారుణం.
– బూస రమేశ్, రైతు, గంభీర్‌పూర్
క్లస్టర్‌కో గోదాం నిర్మించాలి
పంట పండించడం ఒకెత్తయితే విక్రయించడం మరో ఎత్తవుతోంది. గోదాములు లేకపోవడం సమస్యని తెలిసినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వ్యవసాయ క్లస్టర్‌కొక గోదాం నిర్మించాలి. మండలంలో ఆరు గోదాంలు నిర్మించే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.
– ఏనుగు గంగారెడ్డి, రైతు, సిరికొండ


