కోటేశ్వరస్వామి ఆలయంలో వేలం | - | Sakshi
Sakshi News home page

కోటేశ్వరస్వామి ఆలయంలో వేలం

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

వెల్గటూర్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజసామాగ్రి, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందుకు గురువారం ఆలయం ఆవరణలో వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజసామగ్రికి రూ. 9.80లక్షలు, కొబ్బరిముక్కల సేకరణకు రూ.80వేలు, లడ్డూ పులిహోరకు రూ.3.20లక్షలు మొత్తం రూ.13.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ పర్యవేక్షకులు ఎం.రాజమౌళి, ఆలయ చైర్మన్‌ పూదరి రమేశ్‌, సర్పంచ్‌ కోటయ్య, ధర్మకర్తలు వెంకటేశ్‌, రాయకోటి, బుద్దె రవి, రాజిరెడ్డి, ఉప సర్పంచ్‌ తిరుపతి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement