7
గరిష్టం/కనిష్టం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.
వేలాడుతున్న వైర్లు
నడికుడలో ఈదురుగాలులకు ఎగిరిపోయిన పైకప్పు
ఈదురుగాలుల బీభత్సం
మల్లాపూర్/ఇబ్రహీంపట్నం/మేడిపల్లి: మల్లాపూర్ మండలం నడికుడ, ఇబ్రహీంపట్నంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నడికుడలో మహిపాల్‌రెడ్డి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. కుటుంబసభ్యులందరూ బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఇబ్రహీంపట్నం మండలంలో 18 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భీమారం మండలం ఈదులలింగంపేటకు చెందిన కాయితి శంకర్ పౌల్టీఫాం రేకులు కొట్టుకుపోయాయి.


