ప్రజల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల సమస్యలు పరిష్కరించాలి

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

● రాయికల్‌ మున్సిపల్‌ సమావేశం ● పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రవి

రాయికల్‌: కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు తీసుకొచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యేసంజయ్‌కుమార్‌ అన్నారు. రాయికల్‌ మున్సిపల్‌ సమావేశాన్ని చైర్మన్‌ కటుకం రవీందర్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా పలు వార్డుల్లో నీటి సమస్య అధికంగా ఉందని, 1, 9, 10, 12వార్డుల్లో అమృత్‌ 2.0 పైప్‌లైన్‌తో డ్యామేజీ అయిన రహదారులకు మరమతు చేయించాలన్నారు. వీధి దీపాల సమస్య పరిష్కరించాలని సూచించారు. వైస్‌ చైర్మన్‌ తురగ సౌజన్య మాట్లాడుతూ సొంత ఇల్లు లేని వారు చనిపోతే దహన సంస్కారాల కోసం ప్రత్యేక షెడ్లు నిర్మించాలని కోరా రు. చైర్మన్‌ రవీందర్‌ మాట్లాడుతూ సమస్యలను నో ట్‌ చేసుకుని దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మి షన్‌భగీరథ కింద పట్టణంలో రెండు ట్యాంకులు నిర్మించామని, రూ.16 కోట్లతో సమస్యలను పరి ష్కరిస్తామన్నారు. 13 అంశాలను ఏకగ్రీంగా తీర్మానించారు. మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ డి.శ్రీని వాస్‌గౌడ్‌, కౌన్సిలర్లు ప్రశాంతి, రాకేష్‌నాయక్‌, మానస, గంగాధర్‌, మహేశ్వరి, గంగలక్ష్మీ, శ్రీధర్‌, చిన్న ధర్మపురి, అధికారులు పాల్గొన్నారు.

లారీల కొరత లేకుండా చూస్తాం

అనంతరం ఎమ్మెల్యే రాయికల్‌లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మక్కలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి

జగిత్యాలరూరల్‌: మహిళాసాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సారంగపూర్‌ మండలం అర్పపల్లిలో రూ.10లక్షలతో నిర్మించే మహిళా సంఘం భవనాలకు భూమిపూజ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్‌ సోల్లు సురేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement