ఇబ్రహీంపట్నం: ధాన్యం కొనుగోళ్లు వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని వర్షకొండలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆలస్యం చేయకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. డాటా ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. ఆర్డీవో నర్సింహారావు, డీసీఎస్‌వో జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేశ్, ఎంపీవో రామకృష్ణరాజు, సర్పంచు పొనకంటి వెంకట్, రైతులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగవంతం చేస్తాం
జగిత్యాలరూరల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. చల్‌గల్‌లో స్థల పరిశీలన చేశారు. నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు సమగ్రంగా ప్రణాళికబద్ధంగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, రూరల్ తహసీల్దార్ హకీం పాల్గొన్నారు.


