జగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్‌ఖన్నా డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో మట్లాడారు. కేంద్రీయ విద్యాలయం స్థల కేటాయింపు విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అండదండలతో చైర్మన్‌గా ఎన్నికై న భోగ శ్రావణి ఆయనపైనే విమర్శలు చేయడం దారుణమన్నారు. సమావేశంలో మైనార్టీ నాయకుడు ఖుర్షీద్ అలీ, ద్యావనపెల్లి రాజేందర్, భోగ నాగభూషణం, ఉషకోల గంగాధర్, కమటాల జగదీష్ తదితరులు ఉన్నారు.


