ఇంటర్‌ విద్యార్థులకు ‘మధ్యాహ్న’ భోజనం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థులకు ‘మధ్యాహ్న’ భోజనం

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

● ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు ● ధాన్యం కొనుగోళ్లు 10 రోజుల్లో పూర్తి చేయాలి ● అదనపు కలెక్టర్‌ బి.రాజాగౌడ్‌

భూ వివాదాన్ని

పరిష్కరించండి

మల్లాపూర్‌: భూ సమస్య పరిష్కరించాలని మండలంలోని కుస్తాపూర్‌కు చెందిన ఈరవత్తిని గంగాధర్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. సమస్యను పరిశీలించేందుకు అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ మంగళవారం గ్రామంలో పర్యటించారు. సదరు స్థలం వద్దకు వెళ్లి గ్రామసభ నిర్వహించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్‌, ఏపీఎం విమోచన, సర్పంచ్‌ జెల్ల రాజేశ్వర్‌, ఉపసర్పంచ్‌ సరికెల మహిపాల్‌, కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు.

‘ఎస్‌డబ్ల్యూఎం’ పకడ్బందీగా అమలు చేయాలి

జగిత్యాల: సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌డబ్ల్యూఎం) నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సాలిడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ కమిటీతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన రూల్స్‌ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో 385 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో తడి, పొడి, శానిటేషన్‌ వ్యర్థాలు, ప్రత్యేక హానికర వ్యర్థాలు మొదట్లోనే వేరుచేసేలా ఇళ్లు, సంస్థల్లో చెత్త డబ్బాలు ఉంచాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రత్యేక వాహనాలు పెట్టాలన్నారు. జూన్‌ 31లోపు సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి గ్రామాలు, పట్టణాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని, వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎరువులు చల్లుతున్నాం

వానాకాలం సీజన్‌ పనులు ప్రారంభమయ్యాయి. పసుపు వేద్దామని పొలాన్ని దున్నించాం. హైదరాబాద్‌ నుంచి కోళ్ల ఎరువును తెప్పించి తోటంతా చల్లించాం. కలుపు మొక్కలు లేకుండా దున్నాను. వర్షం కురిస్తే పసుపు వేసేలా భూమిని సిద్ధం చేశాను.

– రాంకిషన్‌, వెల్దుర్తి, జగిత్యాల రూరల్‌(మం)

పనులు ప్రారంభమయ్యాయి

రోహిణి కార్తె ప్రారంభంతో వానాకాలం పనులు ప్రారంభయ్యాయి. ట్రాక్టర్‌తో లోతైన దుక్కులు చేసుకుంటే వర్షపు నీరు నిల్వ ఉండి పంటకు హాని చేసే పురుగులు కూడా చనిపోతాయి. జనుము, జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకోవాలి.

– హరీశ్‌కుమార్‌ శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్‌, పొలాస

మల్లాపూర్‌: జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనుంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. హాజరుశాతం పెరగడంతోపాటు చదువుపై దృష్టి పెట్టనున్నారు. ఇంటర్‌ విద్యార్థులకూ ఆల్పాహారం, పాలు అందించనుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అర్ధాకలితోనే కళాశాలకు..

జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్‌ చదువు కోసం ఆయా జూనియర్‌ కళాశాలలకు వస్తుంటారు. ఉదయం 8 గంటలకే ఇంటినుంచి బయల్దేరుతారు. ఆ సమయంలో పేద విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండానే వస్తుంటారు. మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో అలమటించాల్సిందే. అలా అర్ధాకలితో ఉన్న విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి ఆ సమస్యకు చెక్‌ పెడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులకు మేలు

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. నీట్‌, జేఈఈ వంటి తరగతులు వారు శ్రద్ధగా వినే అవకాశం ఉంటుంది.

– రాజేశం, రసాయనశాస్త్రం, జేఎల్‌, జీజేసీ–మల్లాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement