పెట్రోల్, డీజిల్‌పై పది శాతం వ్యాట్ తగ్గించాలి ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకే దొంగ ధర్నాలు బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలుగా మారాయని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ పార్టీ దొంగ ధర్నాకు దిగిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌పై 10శాతం వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకే పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు, యువత, మహిళలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇంకా రెండేళ్లు భరిస్తే వచ్చే పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయమని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరిందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, విజయలక్ష్మి, వెంకటేశ్వర్‌రావు, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ధర రమేష్, కల్లెపెల్లి దుర్గయ్య, సురేందర్, రాధాకిషన్, రఘువీర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


