బీజేపీకో న్యాయం.. కాంగ్రెస్‌కో న్యాయమా..? | - | Sakshi
Sakshi News home page

బీజేపీకో న్యాయం.. కాంగ్రెస్‌కో న్యాయమా..?

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

● ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తారా.. ● బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి

జగిత్యాలటౌన్‌: ప్రజాసంక్షేమం మర్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని బీజేపీ నిరాహార దీక్షకు అనుమతించని పోలీసులు.. పెట్రోల్‌ ధరలు తగ్గించాలన్న కాంగ్రెస్‌ ధర్నాకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బీజేపీకో న్యాయం.. కాంగ్రెస్‌కో న్యాయమా అంటూ నిలదీశారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌, ఎకై ్సజ్‌ డ్యూటీ వసూలు చేస్తూ ప్రజలపై తీరని భారం మోపుతున్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రో ధరలను పరిశీలించాలని సూచించారు. వేముల శ్రీనివాస్‌, నిమ్మల నాగరాజు, దూరిశెట్టి మమత, సిరిపురం శ్రీనివాస్‌, గడ్డల లక్ష్మి, చెన్నాడి మధురిమ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement