ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారు..? | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారు..?

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

జగిత్యాలరూరల్‌:ధాన్యం కొనుగోళ్లను ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత ప్రశ్నించారు. జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని, రైతులు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని తెలిపారు. వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి యుద్ధప్రతిపాదికన కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్‌, మాజీ సర్పంచ్‌ సుభాష్‌, నాయకులు గంగారెడ్డి, మల్లేశంగౌడ్‌, నారాయణరెడ్డి, మల్లారెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement