రైతు సమస్యలు విస్మరించి ధర్నా చేయడం సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలు విస్మరించి ధర్నా చేయడం సిగ్గుచేటు

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

రాయికల్‌(జగిత్యాల): రైతు సమస్యలను విస్మరించిన కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం రాయికల్‌ పట్టణంలో మొక్కజొన్న రైతులు లారీల కొరతపై నిర్వహించిన ధర్నాకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. పెట్రోల్‌పై 30 శాతం వ్యాట్‌, డీజిల్‌పై 28 శాతం ఉందని, ఇది కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రోహిణి కార్తె ఆరంభం నాటికి గతంలో కొనుగోళ్లు పూర్తయ్యేవని, ప్రస్తుతం కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాయాల్సి న దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈనెల 31లోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని, లేకుంటే వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతులకు యూరియా బస్తా కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, దీని కోసం యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే యూరియా సరఫరా చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, న్యాయవాది తాటిపర్తి రాంచంద్రారెడ్డి, ఏఎంసీ మా జీ చైర్మన్‌ మారంపల్లి రాణి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బ ర్కం మల్లేశ్‌యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అ నిల్‌, నాయకులు తురగ శ్రీధర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మండ రమేశ్‌, గోపి రాజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement