బీటీ రోడ్డు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

బీటీ రోడ్డు ప్రారంభించాలి

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

కుల బహిష్కరణ చేసి

వేధిస్తున్నారు

మాది కోరుట్ల మండలం జోగినిపల్లి గ్రామం. గంగపుత్ర కులానికి చెందిన నేను 2012లో సంఘం నిర్వహించిన డ్రా పద్ధతిలో అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాను. వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని తాను నిర్వహించలేనని చెప్పగా కుల పెద్దలు రూ.వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించనందుకు నా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఎలాంటి కార్యాలకు పిలవకుండా మానసికంగా వేధిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం కుల సంఘం పెద్దలను పలుమార్లు కలిసినా స్పందించడం లేదు. మా ఊరి చెరువులో నా వాటా కింద వచ్చే చేపలను పట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.

– పల్లికొండ పెద్ద పోచయ్య,

జోగినిపల్లి, కోరుట్ల

జగిత్యాల పట్టణం 16వ వార్డు రహమత్‌పురాలో బాబా కిరాణం నుంచి దగ్గులమ్మ గుడికి వెళ్లే రో డ్డు పూర్తిగా పాడయిపోగా గతేడాది బీటీ రో డ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 7నెలలు గడుస్తున్నా పనులు సాగడం లేదు. రోడ్డు పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– ఎండీ సల్మాన్‌ సోదరులు,

రహమత్‌పుర, జగిత్యాల

Advertisement
 
Advertisement
Advertisement