జగిత్యాల రూరల్ మండలం పొలాస దామెరకుంటలో 13.27ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నీటి పారుదల, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా పరిశీలించారు. సదరు భూమిలో వరి సాగుచేస్తున్నందున పంట కోసిన తర్వాత సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ప్రస్తుతం పంట కోసినందున సర్వే చేసి ఆక్రమణకు గురైన భూమిని కాపాడాలి.
– పొలాస మత్స్య సంఘం ప్రతినిధులు
విచారణ చేపట్టాలి
దశాబ్ది సంపద వనాల పేరిట కొండాపూర్ గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కన రెండు చోట్ల సుమారు 846మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో 100లోపు చెట్లే ఉన్నాయి. అవి కూడా ఎండిపోతున్నాయి. వీటికి మరో రూ.లక్ష ఖర్చు చేసి రిప్లేస్‌మెంట్ మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, హరి తహారం లాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ప్రజా ఐక్యవేదిక
ప్రతినిధులు,కొండాపూర్, మేడిపల్లి


