జగిత్యాలటౌన్: బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి కరెంట్ తీగ అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్ తప్పదని బీజేపీ నాయకులు మ్యాదరి అశోక్, ఓరుగంటి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావణికి 43వేల ఓట్లు రావడంతో బెంబేలెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు విద్య ప్రాధాన్యత తెలియదని, అందుకే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును అడ్డుకుంటున్నారని తెలిపారు. మొన్నటిదాకా ఒరిజినల్, డూప్లీకేట్ అని కొట్టుకున్న నాయకులు బీసీ ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యారని విమర్శించారు. ఆముద రాజు, పుష్ప, మమత, సిరిపురం శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చంద్రశేఖర్, భోగ శ్రావణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అనూప్‌రావు, పూదరి అరుణ, ఓరుగంటి చంద్రశేఖర్ పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో పాల్గొన్నారు.


